మా చిన్న పల్లెటూరు లో మొత్తం 20 ఇళ్ళు. అందరు మా చుట్టాలే, కాకపోయినా అలా కలిసి ఉండే వాళ్ళం. హాస్టల్ లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో ఊరు వెళ్ళేవాళ్ళం. మా మామయ్య పిల్లలు, బాబయ్య పిల్లలు అందరం కలిసి ఒక 15 మంది దాక ఉండేవాళ్ళం. మేము అందరం కలిసి చేసిన అల్లరి, గోల, ఆటలు, పాటలు ఇవి మాత్రమే మేమందరం పోగేసుకున్న జ్ఞాపకాలు. మధురమైన జ్ఞాపకాలు. ఇలా జ్ఞాపకాల గులకరాల్లలో కొన్ని రాళ్ళు నీటిలోకి విసిరుతూ అలా...
జామకాయ చెట్టు -
రోడ్ల మీద ముళ్ళు పెట్టడం
ఈ జ్ఞాపకం ఎన్ని సార్లు తలుచుకున్నా మొహం మీద చిరునవ్వు తెస్తుంది. మా వెర్రి ఎన్ని వింత తలలు వేసేదో చెప్తుంది. మా ఊరిని ఆనుకొని రోడ్ ఉండేది, దాని మీద RTC బస్సులు, జీపులు, వెళ్ళేవి. ఎవరి ఆలోచనో గుర్తులేదు కాని ఆ రోడ్ మీద వెళ్తున్న బస్సుల కింద ముళ్ళు పెట్టి వాటిని పంచర్ చెయ్యాలని అనుకున్నాం. పెద్ద పెద్ద సర్కస్ ముళ్ళు ఏరుకొని రోడ్ మీద చక్కగా పరిచి, పక్కనే ఉన్న మా గడ్డి వాము వెనక దాక్కొని బస్సు ముళ్ళమీద నుండి వెళ్ళడం చూసి గట్టిగ అరిచేవాళ్ళం. కాస్త దూరం వెళ్ళాక ఆగిపోతుందేమో అని ఎదురు చూసేవాళ్ళం. మా పిచ్చి కాకపోతే బస్సు పయ్యలు మేము పెట్టిన చిన్న ముళ్ళకి పంచర్ అవుతాయా. అది అప్పట్లో తెలిలేదు మాకు. చివరకి ఇలా జీపులు, బస్సులకి ఏమి కావడం లేదు అని స్కూటర్ ల మీద పడ్డాం. దూరంగా ఏదో స్కూటర్ కనిపిస్తే ముళ్ళు పెట్టి ఎదావిధిగా దాక్కున్నాం. దగరికి వస్తున్న స్కూటర్ మీద స్వయంగా మా నాన్నే. ఇంకేముంది బండి పంచర్ కాలేదు కాని మాకు పంచర్ పడింది. మా నాన్న పెద్దగా ఏమి అనలేదు, పైగా ఈ ముళ్ళ వల్ల బుస్సులకి ఏమి కాదు అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.దాగిలి మూతలు (Hide and seek)
వీడి వీడి గుమ్మడి పండు వీడి పేరేంటి అని మా మామయ్య కళ్ళు మూసి ఆడించడం, ఆ చేతి స్పర్చ ఇంకా కల్ల మీద అలాగే ఉంది. కాస్త చీకటి పడుతుంటే మాకు దొరికే ఒకే ఒక్క ఆట దాగిలి మూటలు.. పిల్లలు పెద్దలు అందరు ఆడుకోనేవాళ్ళం, పిల్లలం దాకుంటే, పెద్దలు మమల్ని దాచడం, లేదా వెతికే వాడికి సహాయం చేయడం లాంటివి చేసేవాళ్ళు. ఈ ఆటలో తెలిసి వచ్చింది మా అపార తెలివితేటలు. దాకున్న వాడికి వెతికేవాడు ఎప్పుడు లోకువే కొన్ని సార్లు అందరు ఒకే చోట దాక్కొని ఒకేసారి మీద పడేవాళ్ళం. ఆ చిన్న సమయం లో అందరి పేర్లు చెప్పి అవుట్ చేయడం కుదరదు కాబట్టి మల్లి వాడే దొంగ. ఇంకో అద్భుతమైన ఆలోచన చెప్పడం మరిచిపోయ్యను, బట్టలు మార్చుకోవడం, దొంగ ని తప్పుతోవ పట్టించడానికి ఆకరికి ఒకరి అంగీలు ఇంకొకరం మార్చుకోనేవాళ్ళం. అందరం చిన్న వాళ్ళం కాబట్టి, అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా మార్చుకొనే వాళ్ళం. ఇలా చొక్కాలు మార్చుకొని దొంగ ని ఇరకాటం లో పెట్టి 'కుండమోరిగిల్ల' 'కుండమోరిగిల్ల' అని అరిసేవాళ్ళం. ఆ పదానికి అర్ధం తెలిదు, అర్ధం ఉందో లేదో కూడా తెలుసుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే దాన్నే బాల్యం అంటారు కాబట్టి.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నో, మల్లి ఇంకో టపా త్వరలో....
Peace if possible, truth at all costs - Martin Luther king
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి