11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మొదటి అడుగు

నేను తన గర్భం లో ఉన్నప్పుడే అనుకుందేమో మా అమ్మ నా పేరు లో ఉన్న స్మృతి లాగే నా జీవితం నాకు చాల స్మృతులని మిగిలించాలని, అలా జీవితం మిగిలించిన గత స్మృతుల జ్ఞాపకాల బరువుని కాస్త మీతో పంచుకుందామనే తపనతోనే ఈ బ్లాగ్ ని మొదలుపెడుతున్నాను.  తెలుగు భాష మీద ఉన్న అభిమానమో, నా జీవితం మిగిలించిన తీపిచేదు గుర్తులో, స్వతహాగ అతిగా వాగే అలవాటు ఉండడం వల్లో, నేను రాయగలనా అన్న సందేహపు తెరని చీల్చడానికో తెలిదు కాని వ్రాస్తున్నాను. వ్రాయడం మొదలుపెడుతున్నాను.

మాట మంత్రమైతే మౌనం అమృతం అని ఎక్కడో చదివాను, అతిగా వాగుతున్న నాకు ఈ వాక్యం మౌనాన్ని పరిచయం చేసింది తర్వాత జీవితం నన్ను సప్తసముద్రాలవతలికి లాగేసి మాతృ భాష కనుచూపు మెరలో వినపడని చోటులో పడేసి తిక్క కుదిరిందా అని నవ్వి వెళ్లిపోయింది. అప్పటి నుండి కొత్తగా పరిచయమైనా మౌనపు సంగర్షణ నుండి బయటపడాలన్న దిశగా వేసిన మొదటి అడుగే నా ఈ బ్లాగ్.

భాష మీద పట్టు లేదు చెప్పాలన్న తపన తప్ప
వ్యాకరణం అంటే తెలిదు వ్యక్తపరచాలన్న ఆశ తప్ప

ఒక చిన్న కవిత ప్రయత్నించాను :-)

నేను వేస్తున్న ఈ మొదటి తప్పటడుగు ఎన్ని నడకలు నేర్పుతుందో, ఏ తీరాలకు చేరుస్తుందో, ఎంత మంది బాటసారులను పరిచయం చేస్తుందో చూడాలి. కొన్ని సార్లు గమ్యం చేరామన్న ఆనందం కంటే నడచిన తోవ బాగుంటుంది. ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందో.

5 కామెంట్‌లు:

  1. ఆరంభం అద్భుతం! నువ్వు రాయగలవన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు. నీకున్న ఙ్ఞానానికి, పరిఙ్ఞానానికి నువ్వు మంచి రచయిత్రివి, కవయిత్రివి అవుతావని నా గట్టి నమ్మకం!
    నీ ఈ అడుగులు నిన్ను గొప్ప తీరాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
    నీ
    నవీన్!

    రిప్లయితొలగించండి
  2. chala baga rasavu, chakaga modalu petavu . . . nuv ilane inka rasi manchini chatistavani ashitutananu

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. Sujji the way you narrate is very clear and touching….memorizing the childhood …….Felt Happy..Thank You .. :)

    రిప్లయితొలగించండి