గత ఆరు రోజులుగా రోజు రాత్రి తన కోసం ఏడుస్తున్నాను. నా కన్నీళ్లు తన బాధలని పోగొడుతుంది అనుకుంటే రోజు ఏడుస్తాను. కాని నేను తన కోసం ఇంత బాధపడుతున్నానని తనకు తెలిదు. తనకి నేనెవరో కూడా తెలిదు. మా ఇద్దరి మధ్య కొన్ని ఖండాల దూరం. తన పేరు క్లౌడీన్ ముర్వేలీన్
ఎక్కడ విన్నట్టు కూడా లేదు కదా ఈ పేరు. ఆఫ్రికా ఖండం లో రువాండా అనే దేశం లో ఒక సాధారణ మహిళ. మహిళ కాబట్టే ఇక్కడ చర్చిస్తున్నాను. మహిళ కాబట్టే తన కోసం ఏడుస్తున్నాను. మహిళ కాబట్టే ఈ వేదన.
రువాండా దేశం లో వేరు వేరు తెగల మధ్య యుద్ధం సర్వసాధారణం. ఇలాంటి రెండు తెగల మధ్యలో జరిగిన ఘర్షనలో క్లౌడిన్ ని వేరే తెగ వాళ్ళు అపహరించుకొని వెళ్లారు. అప్పుడు తను 13 సంవత్సరాల చిన్న పిల్ల.
తనను అపహరించుకొని ఒక గది లో వేసారు. అలాంటి గదులు ఆ భవనం లో చాలానే ఉన్నాయి. క్లౌడిన్ లాంటి అమ్మాయిలు కూడా చాల మందే ఉన్నారు ఆ గదుల్లో . అ భవనం పేరు రేప్ హౌస్ (rape house). అక్కడ పోరాడుతున్న సైనికుల కోరికలు తీర్చుకోవడానికి క్లౌడిన్ లాంటి అమ్మాయిలను బంధించారు. భవనం బయట ఓపికగా భార్లు తీరారు సైనికులు, లోపల ఆ చిన్న పిల్లలకి నరకం ఏంటో చూపించడానికి ఎదురుచూస్తూ....
అలా క్లౌడిన్ ని ఎంత మంది బలవంతం చేసారో తనకి తెలిదు ఎందుకంటే లెక్కబెట్టలేనంత మంది చేసారు కాబట్టి, ఎంత వరకు అంటే తనకి కాళ్ళ మధ్య లో స్పర్శ లేనంతగా. తన వాసన తనే భరించలేనంతగా చేసారు. నడవడం కూడా నరకం అనిపించేలా చేసారు. మలమూత్రాలు ఎప్పుడు విసర్జిస్తుందో తెలియనంతగ. తను 13 సంవత్సరాల చిన్నపిల్ల పాపం (ఇది రాస్తూ తనకోసం మరో కన్నీటి చుక్క)
ఇది కేవలం క్లౌడిన్ పడే బాధలు కాదు ఆ భవనం లో ని అందరు పిల్లలు పరిస్థితి, అలాంటి భవనాలు ఆ దేశం లో ఎన్నో, అలాంటి దేశాలు ఆఫ్రికా ఖండం లో ఎన్నో. ఇది కేవలం ఆఫ్రికా కి మాత్రమె పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచం మీద 2 కోట్ల మంది అమ్మాయిలని వ్యభిచారం కోసం ఇలా హింసిస్తున్నారు. ఈ సంఖ్యా కేవలం 16 సంవత్సరాల లోపు పిల్లలది మాత్రమే.
క్లౌడిన్ కోసం నేనేం చేయాలో నాకు తెలిదు. తన కోసం బాధ పడుతున్నాను, కాని నా భాధ తన భాధాలని దూరం చేయ్యనప్పుడు అది వృధానే. మన పరిధి లో మనం ఏమి చేయలేకపోవచ్చు, మన ఉద్యోగ రిత్య కుటుంభ రిత్య అది సాధ్యం కాకపోవచ్చు, కాని అన్ని వదులుకొని ఇలాంటి వాళ్ళకోసం సహాయం చేసే దేవతలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఆర్ధిక సహాయం అందించడానికి ప్రయత్నిదాం.
ఈ సంస్థ గురించి తెలుసుకున్నాను. http://www.womenforwomen.org/
ఇలా భురద లో దిగి పని చేసేవాళ్ళ కోసం వీలైత సహాయం చేదాం, క్లౌడిన్ లాంటి ఇంకో అమ్మాయి కన్నీరు తుడవడం కోసం.
ఈ విషయాన్ని మీ ముందుకి తీసుకొని రావాలనే చిన్న ప్రయత్నం
ఈ విషయాన్ని మీ ముందుకి తీసుకొని రావాలనే చిన్న ప్రయత్నం